గుంటూరులో వాలంటీర్‌పై దాడి
ABN , First Publish Date - 2020-09-18T13:31:45+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లి పట్టణం నాగార్జున కాలనిలో వార్డు వాలంటీర్ గౌస్(21)పై ఇద్దరు యువకులు దాడి చేశారు.

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి పట్టణం నాగార్జునకాలనీలో వార్డు వాలంటీర్ గౌస్(21)పై ఇద్దరు యువకులు దాడి చేశారు. అరే అన్నాడనే నేపంతో వాలంటీర్‌పై రాడ్డుతో యువకులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌస్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.