గుంటూరులో మరోసారి గౌడ కులస్తులపై అధికార పార్టీ నేతల దాడి

ABN , First Publish Date - 2020-09-03T17:35:26+05:30 IST

జిల్లాలో గౌడ కులస్తులపై అధికార పార్టీకి చెందిన నేతలు మరోమారు దాడికి తెగబడ్డారు.

గుంటూరులో మరోసారి గౌడ కులస్తులపై అధికార పార్టీ నేతల  దాడి

గుంటూరు: జిల్లాలో గౌడ కులస్తులపై అధికార పార్టీకి చెందిన నేతలు మరోమారు దాడికి తెగబడ్డారు. పొలం పనులకు వెళ్లిన ఓ గౌడ మహిళ పట్ల అధికార పార్టీకి చెందిన వ్యక్తి  అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ తన కుటుంబసభ్యులకు తెలుపగా... అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కుటుంబసభ్యులు నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన అధికార పార్టీ సామాజిక వర్గం నేతలు మహిళ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా...పోలీసుల జీపును అధికార పార్టీ సామాజిక వర్గం నేతలు అడ్డుకున్నారు. క్రోసూరు మండలం అనంతవరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే కొల్లిపర మండలం మున్నంగిలో ఓ గౌడ కులస్తుడుని అధికార పార్టీ నేతలు వేధించిన విషయం తెలిసిందే. వరుసగా సంఘటనలతో గౌడ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-03T17:35:26+05:30 IST