వేధింపుల ఈఎస్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-10-13T08:35:26+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) గుంటూ రు సూపరింటెండెంట్‌ ఎన్‌.బాలకృష్ణన్‌పై ప్రభుత్వం వేటు వేసింది.

వేధింపుల ఈఎస్‌ సస్పెన్షన్‌

ఎస్‌ఈబీ గుంటూరు సూపరింటెండెంట్‌పై వేటు

మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఫలితం


గుంటూరు(కార్పొరేషన్‌),అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) గుంటూ రు సూపరింటెండెంట్‌ ఎన్‌.బాలకృష్ణన్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ సాధారణ పరిపాలన శాఖలోని ఎస్‌ఈబీకి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డీజీపీ గౌతం సవాంగ్‌ సోమవారం జీవో నంబరు 1567 జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు ఆయన సస్పెన్షన్‌లోనే ఉంటారని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లకూడదని స్పష్టంచేశారు. గుంటూరు ఎస్‌ఈబీలో రెండేళ్లుగా పనిచేస్తున్న బాలకృష్ణన్‌ తన పదవీకాలం అంతా అవినీతి, అక్రమాలకు పాల్పడటమే కాకుండా పలువురు మహిళా సీఐలు, ఎస్‌ఐలు, తన కార్యాలయ సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేశారు.


దీనిపై జూలైలో ‘అపర కీచకుడు ఆ పోలీస్‌’.. ‘కొనసాగుతున్న అధికారి వేధింపుల పర్వం’ శీర్షికన కథనాలు వెలువడగా అప్పట్లో ఓ మహిళా డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. సక్రమంగా విచారణ జరపలేదని ఆ డీఎస్పీపై  ఆరోపణలు రావడంతో అది బుట్టదాఖలైంది. ఆయన వేధింపులకు గతనెలలో పెదకూరపాడు ఎస్‌ఈబీ మహిళా ఎస్‌ఐ ఆత్మహత్యకు యత్నించడంతో ‘వేధింపుల పర్వం’ శీర్షికన గత నెల 13న ‘ఆంధ్రజ్యోతి’లో మరో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ విచారణ అఽధికారులను నియమించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గుంటూరులోని ఓ ఎస్‌ఈబీ స్టేషన్‌కు మహిళా అఽధికారినిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆమె బాలకృష్ణన్‌ వేధింపులు తాళలేక తిరిగి పాత స్టేషన్‌కు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.

Updated Date - 2020-10-13T08:35:26+05:30 IST