స్టేట్ కోసం జగన్.. రియల్ ఎస్టేట్‌ కోసం బాబు: అమర్‌నాథ్

ABN , First Publish Date - 2020-07-15T23:52:12+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం ఇక్కడ

స్టేట్ కోసం జగన్.. రియల్ ఎస్టేట్‌ కోసం బాబు: అమర్‌నాథ్

విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. పరదవాడ అగ్ని ప్రమాద బాధితులను విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు పరామర్శించారని తెలిపారు. విశాఖలో వరుస ప్రమాదాలపై తనకు అనుమానం వస్తోందని అమర్నాథ్ అన్నారు. పరవాడ ఘటనపై చంద్రబాబు ప్రకటన గుమ్మడి కాయ దొంగల సామెతను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రమాదాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 


గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారికి ఎంత పరిహారం అందించారో చెప్పాలని టీడీపీని అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబులో ఉన్నది రక్తం కాదని, కుట్ర అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని నిప్పులు విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే తీరికే చంద్రబాబుకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ మీద దెబ్బ కొట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దయచేసి అలాంటి ఆలోచనలను చంద్రబాబు మానుకోవాలని హితవుచెప్పారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమర్నాథ్ హెచ్చరించారు. స్టేట్ కోసం జగన్.. రియల్ ఎస్టేట్‌ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-07-15T23:52:12+05:30 IST