జీఎస్‌ఎల్‌ ఎనస్థీషియాలజీ హెచ్‌ఓడీ మృతి

ABN , First Publish Date - 2020-07-19T09:06:16+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎ్‌సఎల్‌ వైద్య కళాశాలలో ఎనస్థీషియాలజీ, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి రామోతి ప్రతాప్‌(68) కొవిడ్‌తో శనివారం మృతిచెందారు.

జీఎస్‌ఎల్‌ ఎనస్థీషియాలజీ హెచ్‌ఓడీ మృతి

రాజానగరం, జూలై 18: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎ్‌సఎల్‌ వైద్య కళాశాలలో ఎనస్థీషియాలజీ, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి రామోతి ప్రతాప్‌(68) కొవిడ్‌తో శనివారం మృతిచెందారు. ఆయన జీఎ్‌సఎల్‌ జనరల్‌ ఆస్పత్రితో పాటు బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్‌లోనూ కొవిడ్‌ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా సోకడంతో జీఎ్‌సఎల్‌ క్వారంటైన్‌లోనే ఆరు రోజులుగా చికిత్స పొందుతున్నారు. పెదపేట మండలం జి.మామిడాడకు చెందిన ఈయన శ్రీవేంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో 1976లో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొంది, గుంటూరు మెడికల్‌ కళాశాల, వేంకటేశ్వర మెడికల్‌ కళాశాల, కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. ఈయన భార్య గృహిణి కాగా, ఇద్దరు కుమారులు వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.


వైద్యులూ జాగ్రత్త: ఐఎంఏ 

కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందించే వైద్యులు, వైద్య విద్యార్థులు సురక్షిత పద ్ధతులు అవలంబించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) జాతీయ శాఖ సూచించింది. ఈ మేరకు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ అన్ని ఐఎంఏ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేశారు. ఆస్పత్రుల్లో శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలన్నారు. ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు, లేబర్‌ రూమ్‌, క్యాజువాల్టీ, ల్యాబోరేటరీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా నివారణ పద్ధతులు కచ్చితంగా అమలు చేయాలని కోరారు.

Updated Date - 2020-07-19T09:06:16+05:30 IST