గుంటూరు: కరోనా లాక్‌డౌన్‌తో పెరుగుతున్న చోరీలు

ABN , First Publish Date - 2020-03-30T17:58:35+05:30 IST

జిల్లాలో కరోనా లాక్ డౌన్‌ ఎఫెక్ట్‌తో చోరీలు పెరుగుతున్నాయి.

గుంటూరు: కరోనా లాక్‌డౌన్‌తో పెరుగుతున్న చోరీలు

గుంటూరు: జిల్లాలో కరోనా లాక్ డౌన్‌ ఎఫెక్ట్‌తో చోరీలు పెరుగుతున్నాయి. ఏటి అగ్రహారం 2వ లైన్‌లో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దుండగులు గడ్డ పలుగుతో దేవాలయం హుండీని పగులగోట్టి.. నగదు అపహారించారు. మూడు రోజుల క్రితం తెనాలి మండలం బుర్రిపాలెంలో ఇద్దరు యువకులు చోరీలకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.

Updated Date - 2020-03-30T17:58:35+05:30 IST