-
-
Home » Andhra Pradesh » Group1 mains in November
-
నవంబర్‌లో గ్రూప్-1 మెయిన్స్
ABN , First Publish Date - 2020-06-23T12:15:27+05:30 IST
నవంబర్‌లో గ్రూప్-1 మెయిన్స్

అమరావతి: ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇచ్చిన నోటిఫికేషన్ల మేరకు ఇప్పటికే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో వాయిదా వేసింది. ఇప్పుడీ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం.. గ్రూప్-1 సర్వీసెస్ మెయిన్స్ నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 2న తెలుగులో పేపర్, 3న ఇంగ్లీషులో పేపర్ జరగనున్నాయి. 5న పేపర్-1, 7న పేపర్-2, 9న పేపర్-3, 11న పేపర్-4, 13న పేపర్-5 నిర్వహిస్తారు. గ్రూప్-1 సర్వీసెస్ మెయిన్స్‌తో పాటు ఇతర రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్. ఆంజనేయులు సోమవారం విడుదల చేశారు.