2 నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌

ABN , First Publish Date - 2020-10-13T09:08:45+05:30 IST

గ్రూప్‌-1 మెయిన్స్‌ నవంబరు 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటన లో తెలిపింది.

2 నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ నవంబరు 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటన లో తెలిపింది. అభ్యర్థులకు ట్యాబ్‌ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేస్తామని, ఈ కొత్త విధానంపై వారి అవగాహన నిమిత్తం వెబ్‌సైట్లో డెమో వీడి యో/యూజర్‌ మాన్యువల్‌ కూడా అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 19 నుంచి https://psc.ap.gov.in  కమిషన్‌ వెబ్‌సైట్లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచుతామంది. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కీలో తప్పులు, అనువాద దోషాలు ఉన్నట్లు పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే!. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. కేసు పరిష్కారమయ్యేలా కోర్టును అభ్యర్థించాలని, ఆ తర్వాతే మెయిన్స్‌ నిర్వహించాలన్న అభిప్రాయాన్ని లీగల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ వ్యక్తం చేసింది. కానీ షెడ్యూల్‌ పాటిస్తామని ఏపీపీఎస్సీప్రకటించడం గమనార్హం.

Updated Date - 2020-10-13T09:08:45+05:30 IST