దుకాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-05-10T09:41:28+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కంటైన్మెంట్‌ జోన్‌, వాటి బఫర్‌ జోన్‌లలో మినహా మిగతా చోట్ల దుకాణాలు తెరిచే

దుకాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌

  • ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరవొచ్చు
  • పట్టణ ప్రాంతాల్లో వంతుల వారీగా..
  • గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి
  • కట్టడి, బఫర్‌ జోన్లలో మాత్రం కుదరదు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కంటైన్మెంట్‌ జోన్‌, వాటి బఫర్‌ జోన్‌లలో మినహా మిగతా చోట్ల దుకాణాలు తెరిచే సమయం పెంచింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ షాపులు ఓపెన్‌ చేయొచ్చు. పట్టణ ప్రాంతాల్లో కాలనీలు, నివాస ప్రాంతాల్లోని దుకాణాలు తెరవొచ్చు. అయితే షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్‌ కాంప్లెక్సులు మాత్రం తెరవకూడదు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ జోన్‌ పరిధికి బయట ఉన్న దుకాణాల మధ్య ఎడం పాటించి ఓపెన్‌ చేయాలి. ఒకవేళ నిత్యావసర, అత్యవసర దుకాణాలైతే పక్కపక్కనే ఉన్నా తెరవొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల షాపులను తెరుచుకోవచ్చు.    

Updated Date - 2020-05-10T09:41:28+05:30 IST