కృష్ణా జిల్లాలో గ్రావెల్ దందా

ABN , First Publish Date - 2020-05-24T21:11:02+05:30 IST

వత్సవాయి మండలం భీమవరంలో పేదప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం..

కృష్ణా జిల్లాలో గ్రావెల్ దందా

కృష్ణాజిల్లా: వత్సవాయి మండలం భీమవరంలో పేదప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం గ్రావెల్‌ను తరలిస్తున్నామన్న నెపంతో అధికార పార్టీ నేతలే అక్రమంగా అమ్ముకుంటున్నారంటూ ఆ పార్టీ నేత వెంకట్ రెడ్డి ఆరోపించారు. కొంగర మల్లయ్య గుట్టు నుంచి లారీలలో మెరక కోసం తరలించిన గ్రావెల్‌ను వేరే ప్రాంతాల్లో డంపింగ్ చేసి.. అదే మట్టిని ఎకరాకు రూ. 2.500 చొప్పున రైతులకు అమ్ముకుంటున్నారన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ఉదయభానుతోపాటు మైనింగ్ రెవెన్యూ మండల పరిషత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించలేదని వైసీపీ నేత వెంకట్ రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-05-24T21:11:02+05:30 IST