-
-
Home » Andhra Pradesh » GRAMA VOLUNTEER IN AS MPTC CONTESTANT
-
ఎంపీటీసీ రేసులో వలంటీర్
ABN , First Publish Date - 2020-03-13T09:38:35+05:30 IST
ఎంపీటీసీ పదవి కోసం గ్రామ వలంటీర్ ఉద్యోగానికి, పాఠశాల విద్యా కమిటీ సభ్యురాలి పదవికి రాజీనామా చేసిందో యువతి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం...

పెద్దాపురం, మార్చి 12: ఎంపీటీసీ పదవి కోసం గ్రామ వలంటీర్ ఉద్యోగానికి, పాఠశాల విద్యా కమిటీ సభ్యురాలి పదవికి రాజీనామా చేసిందో యువతి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు ఎంపీటీసీ-1 స్థానానికి నంది ఉమామహేశ్వరి టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ వలంటీర్, విద్యా కమిటీ సభ్యురాలి పదవి రాజీనామా లేఖలను సంబంధిత అధికారులకు ఆమె అందజేశారు. డిగ్రీ పూర్తిచేసిన తాను ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.