డిసెంబరు 21నాటికి పేదలకు ఇళ్లు: కొడాలి నాని

ABN , First Publish Date - 2020-08-16T08:21:35+05:30 IST

డిసెంబరు 21 జగన్‌ పుట్టినరోజు నాటికి రాష్ట్రంలో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు...

డిసెంబరు 21నాటికి పేదలకు ఇళ్లు: కొడాలి నాని

శ్రీకాకుళం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 21 జగన్‌ పుట్టినరోజు నాటికి రాష్ట్రంలో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ గాంధీ జయంతి లేదా దసరా నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, ఆరునూరైనా జగన్‌ పుట్టినరోజునాటికి పంపిణీ ఖాయమని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం శ్రీకాకుళంలో ఆయన పతావిష్కరణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  


Updated Date - 2020-08-16T08:21:35+05:30 IST