మా కడుపు కొట్టారు!
ABN , First Publish Date - 2020-03-02T07:52:26+05:30 IST
మధ్యాహ్న భోజన ఏజెన్సీని అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ ఓ దివ్యాంగురాలు నిరసన దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన దివ్యాంగురాలు సుధానాగరాణి పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

- మధ్యాహ్న భోజన ఏజెన్సీ తొలగింపు అక్రమం
- డోన్‌లో దివ్యాంగురాలి రిలే నిరాహార దీక్ష
- వైసీపీ నేతలు లాగేసుకున్నారని ఆరోపణ
డోన్, మార్చి 1: మధ్యాహ్న భోజన ఏజెన్సీని అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ ఓ దివ్యాంగురాలు నిరసన దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన దివ్యాంగురాలు సుధానాగరాణి పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008నుంచి మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 600మంది విద్యార్థులు ఉన్నారు. అనేక కష్టనష్టాలకోర్చి ఇన్నాళ్లూ సేవలు అందించిన ఆమెను విద్యాశాఖ అధికారులు తొలగించారు. సోమవారం నుంచి ఏజెన్సీ తొలగించినట్లు ఎంఈవో ప్రభాకర్ నోటీసులు ఇచ్చారు. కొందరు వైసీపీ నాయకుల ఒత్తిడితో ఆ బాధ్యతలను పాతపేటకు చెందిన సరస్వతి బాయి అనే మహిళకు అప్పగించారు. దీంతో సుధానాగరాణి పాత బస్టాండ్‌లోని సమైక్యాంధ్ర కట్టపై రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా దివ్యాంగురాలనే కనికరం కూడా లేకుండా వైసీపీ నాయకులు మధ్యాహ్న భోజనం ఏజెన్సీని అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. 12ఏళ్ల నుంచి ఏజెన్సీని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, ఇప్పుడు తమ కడుపుకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.