కరోనా మృతుల అంత్యక్రియలకు కమిటీలు

ABN , First Publish Date - 2020-04-24T07:56:53+05:30 IST

కరోనా వైరస్‌ నిర్ధారణ జరిగి, ఆ కారణంతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. కరోనా మృతులకు తమ ప్రాంతంలోని...

కరోనా మృతుల అంత్యక్రియలకు కమిటీలు

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నిర్ధారణ జరిగి, ఆ కారణంతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. కరోనా మృతులకు తమ ప్రాంతంలోని శ్మశానవాటికల్లో అంత్యక్రియలు జరపొద్దంటూ పలుచోట్ల స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇకపై ఇలాంటి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యేలా చూసేందుకుగాను ఏడు ప్రభుత్వశాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలను నియమించాల్సిందిగా కలెక్టర్లను కోరింది. కరోనా నిర్ధారిత, అనుమానిత మృతులకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అంతిమ సంస్కారాలు జరిగేవిధంగా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 


Updated Date - 2020-04-24T07:56:53+05:30 IST