అంబేడ్కర్‌ చిరస్మరణీయుడు: గవర్నర్‌

ABN , First Publish Date - 2020-04-15T09:34:51+05:30 IST

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్‌ అంబేడ్కర్‌కు భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

అంబేడ్కర్‌ చిరస్మరణీయుడు: గవర్నర్‌

అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్‌ అంబేడ్కర్‌కు భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడిగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా అంబేడ్కర్‌ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయునిగా ఉంటారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గవర్నర్‌ నివాళులర్పించారు.


కరోనా నేపథ్యంలో రాజ్‌భవన్‌ అధికారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ, అతి నిరాంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) తరఫున అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అనంతపురం మడకశిరలోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోనూ పలువురు కాంగ్రెస్‌ నేతలు బాబాసాహెబ్‌కు నివాళులర్పించారు.

Updated Date - 2020-04-15T09:34:51+05:30 IST