చెప్పు తెగేదాకా కొడతా

ABN , First Publish Date - 2020-11-06T08:25:53+05:30 IST

‘‘ఇసుకను మరో ప్రాంతానికి ఎలా తరలిస్తావు... చెప్పు తెగేదాకా కొడతా... నీ ఇష్టమొచ్చినట్లు తరలిస్తే నీ...’’ అంటూ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు

చెప్పు తెగేదాకా కొడతా

ఇసుక నిల్వ కేంద్రం ఇన్‌చార్జిపై ప్రభుత్వ విప్‌ కాపు బూతు పురాణం


రాయదుర్గం, నవంబరు 5: ‘‘ఇసుకను మరో ప్రాంతానికి ఎలా తరలిస్తావు... చెప్పు తెగేదాకా కొడతా... నీ ఇష్టమొచ్చినట్లు తరలిస్తే నీ...’’ అంటూ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నోరు చేసుకొన్నారు. ఇసుక నిల్వ కేంద్రం ఇన్‌చార్జిపై ఆయన రాయలేని బూతులతో విరుచుకుపడిన ఆడియో హల్‌చల్‌ చేస్తోంది. రాయదుర్గం మొలకాల్మూరు రోడ్డులోని ఇసుక నిల్వ కేంద్రం ఇన్‌చార్జ్‌పై ఫోన్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురానికి, రాయదుర్గం నుంచి ఎలా తరలిస్తావంటూ దూషణకు దిగారు. నువ్వు అక్కడే ఉంటే నేనొస్తానంటూ... చిందులేశారు. ప్రభుత్వం ఇసుకను విక్రయించేందుకు అధికారికంగా వేదావతి హగరి నుంచి తరలించి నిల్వకేంద్రాన్ని రాయదుర్గంలో ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినవారికి ఇసుకను నిల్వకేంద్రం నుంచి తరలిస్తున్నారు. ఫోన్‌లో ఇన్‌చార్జ్‌పై తీవ్రస్థాయిలో బూతులు వాడడంపై విమర్శలొస్తున్నాయి. 

Updated Date - 2020-11-06T08:25:53+05:30 IST