-
-
Home » Andhra Pradesh » Government orders releasing budget for eight districts
-
ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ABN , First Publish Date - 2020-06-22T21:19:18+05:30 IST
ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు పధకం కింద పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బడ్జెట్ విడుదల చేశారు.

అమరావతి: ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు పధకం కింద పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బడ్జెట్ విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు రూ.80 కోట్లు, విశాఖపట్నానికి రూ.39కోట్లు, అనంతపురానికి రూ.60 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది జిల్లాలకు కలిపి రూ.459 కోట్లు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.