నారా లోకేష్‌పై మండిపడ్డ గోరంట్ల మాధవ్
ABN , First Publish Date - 2020-06-16T16:59:23+05:30 IST
నారా లోకేష్‌పై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నారా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాటలు దగ్గర పెట్టుకుని

అనంతపురం: నారా లోకేష్‌పై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నారా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాటలు దగ్గర పెట్టుకుని అనంతపురం రావాలి. జగన్మోహన్‌రెడ్డిని విమర్శిస్తే హీరో కాలేవు. కల్లిబొల్లి మాటలతో ప్రజలను మభపెట్టవద్దు. మంగళగిరిని మందలగిరి అని మాట్లాడుతున్నారు. ఎవరి కొంపలు అంటించడానికి చంద్రబాబు కాగడలు పట్టుకున్నారు. అలీబాబా అరడజను దొంగలు లాగా కాగడాలు పట్టుకున్నారు. రాజారెడ్డి కుటుంబంలో కులాంతర వివాహం చేసుకున్నారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీలకు అతీతంగా వెళ్తున్నారు.’’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.