అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: గోరంట్ల

ABN , First Publish Date - 2020-11-25T22:32:14+05:30 IST

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: గోరంట్ల

ఇంటర్నెట్ డెస్క్: పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చేస్తామనడం ఒవైసీకి తగదన్నారు. ఇవి తీవ్ర అభ్యంతరకరమని, రాజకీయంగా ఎన్నికలు చూడాలన్నారు. కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాస్వామ్యం హర్షించదని, దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  Read more