-
-
Home » Andhra Pradesh » gorantla butchaiah chowdary somu veerraju
-
సోము వర్సెస్ గోరంట్ల.. ట్విట్టర్ వార్
ABN , First Publish Date - 2020-12-28T18:23:05+05:30 IST
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ప్రత్యేక హోదాపై ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదన్న బీజేపీ సోము వీర్రాజు మాటలను గోరంట్ల ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను సోము రీట్వీట్ చేస్తూ.. ప్రత్యేక హోదా అవసరం లేదంటూ అర్ధరాత్రి ప్యాకేజికి ఒప్పుకున్న చంద్రబాబు వైఖరి ప్రజలను గందరగోళ పరిచిందన్నారు. నాడు ప్యాకేజీ ద్వారా నిధులిస్తే, వాటిని ఏ రకంగా పంపకాలు చేసుకున్నారో కూడా ప్రజలు గ్రహించారని, అందుకు ఫలితమే నేటి టీడీపీ దుస్థితికి కారణమని.. ఆ విషయం మీకు తెలుసంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు ట్వీట్ చేసిన గోరంట్ల, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదన్న బీజేపీ మాట.. వైసీపీ వారిదా లేక బీజేపీ అధ్యక్షుడి మాటా అనేది ప్రజలను గందరగోళపరుస్తుందన్నారు. సీఎం జగన్ ఇది విన్నారనే అనుకుంటున్నానని ట్వీట్ చేశారు.