మోదీకి తాకట్టు పెడుతున్నారు: గోరంట్ల

ABN , First Publish Date - 2020-10-31T19:00:19+05:30 IST

మోదీకి తాకట్టు పెడుతున్నారు: గోరంట్ల

మోదీకి తాకట్టు పెడుతున్నారు: గోరంట్ల

తూర్పుగోదావరి: అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. అమరావతిపై సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రైతులకు సంకెళ్లు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును తుంగలో తొక్కేందుకు కేంద్రంతో రాజీపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌.. మోదీకి తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. 

Read more