ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్

ABN , First Publish Date - 2020-11-20T03:54:25+05:30 IST

పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కోటిన్నర విలువైన బంగారాన్ని మేనేజర్ వీరబాబు మాయం చేశారు. కంపెనీతో..

ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్

విజయవాడ: పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కోటిన్నర విలువైన బంగారాన్ని మేనేజర్ వీరబాబు మాయం చేశారు. కంపెనీతో సంబంధం లేకుండా గోల్డ్ స్కీమ్ పెట్టారు. స్కీమ్ ద్వారా గోల్డ్ డిపాజిట్ చేస్తే గ్రాము బంగారం ఉచితంగా ఇస్తామంటూ మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వీరబాబుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వీరబాబు కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2020-11-20T03:54:25+05:30 IST