బంధువుల ఇంటికి వెళుతూ...

ABN , First Publish Date - 2020-05-08T10:37:25+05:30 IST

రత్నాల గంగాధర్‌ చౌదరి(64). ఆంధ్రా బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తే కొద్ది రోజుల క్రితమే రిటైరయ్యారు.

బంధువుల ఇంటికి వెళుతూ...

విశాఖపట్నం, మే 7(ఆంధ్రజ్యోతి):రత్నాల గంగాధర్‌ చౌదరి(64). ఆంధ్రా బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తే కొద్ది రోజుల క్రితమే రిటైరయ్యారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో వుంటున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన విషవాయువు బారినపడిన ఆయన తీవ్ర ఆందోళన చెంది బైక్‌పై కొత్తవలసలో బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చింతలపాలెం చెక్‌పోస్టు వద్దకు చేరుకునేసరికి అస్వస్థతకు గురై ఉన్నఫళంగా కిందపడిపోయారు. వెంటనే ఆటోలో ఎక్కించి కొత్తవలస పీహెచ్‌సీకి తరలించారు. విషవాయువు పీల్చడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ కె.ఎన్‌.ఎం.మణికుమారి తెలిపారు. 

Updated Date - 2020-05-08T10:37:25+05:30 IST