ప్రైవేటుకు గౌతమి, గోదావరి రైళ్లు!
ABN , First Publish Date - 2020-12-15T09:31:00+05:30 IST
విజయవాడ రైల్వే డివిజన్లో భారీ డిమాండ్ ఉన్న గోదావరి, గౌతమి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
విజయవాడ రైల్వే డివిజన్లో భారీ డిమాండ్ ఉన్న గోదావరి, గౌతమి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రైల్వేబోర్డు ఆదేశాల మేరకు డివిజన్ అధికారులు దీనిపై ప్రతిపాదనలను సిద్ధంచేస్తున్నారు. ప్రైవేటుకు అప్పగించే ప్రయతాల్లో భాగంగా ఈ రైళ్లలోని కోచ్‌లను ఏసీగా మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే జరిగితే.. ఇకపై వీటిలో జనరల్, స్లీపర్ కోచ్‌లు ఉండవు. పేద వర్గాలకు ఈ రైళ్లు దూరంకానుండగా, మధ్యతరగతి వర్గాలకు ప్రయాణం భారంగా మారనుంది. ఇటీవల బిడ్డర్లతో నిర్వహించిన భేటీలో జరిగిన రహస్య ఒప్పందాల్లో ఈ ప్రతిపాదనా ఉన్నట్టు తెలుస్తోంది.