పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం

ABN , First Publish Date - 2020-09-17T04:13:24+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం అయింది. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో..

పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం అయింది. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో దుండగులు హనుమాన్‌ విగ్రహం చేయి విరగ్గొట్టారు. ఏలేశ్వరం శివాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-17T04:13:24+05:30 IST