విద్యార్ధిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-16T23:18:56+05:30 IST

ఓ విద్యార్ధిని ప్రాణాలు తీసుకుంది. ఉరి వేసుకొని ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జీలుగుమిల్లి బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జీలుగుమిల్లి బాలికల వసతి గృహంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నవ్యశ్రీ(16) హాస్టల్‌ గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్ధిని ఆత్మహత్య

పశ్చిమ గోదావరి : ఓ విద్యార్ధిని ప్రాణాలు తీసుకుంది. ఉరి వేసుకొని ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జీలుగుమిల్లి బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జీలుగుమిల్లి బాలికల వసతి గృహంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నవ్యశ్రీ(16) హాస్టల్‌ గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


నవ్యశ్రీ స్వగ్రామం చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంగా హాస్టల్‌ సిబ్బంది తెలిపారు. నవ్యశ్రీని హాస్టల్‌ సిబ్బంది జీలుగుమిల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారని, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారని చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-03-16T23:18:56+05:30 IST