తిరుపతిలో 70 మందికి కరోనా పాజిటివ్: కమిషనర్ గిరీష
ABN , First Publish Date - 2020-07-08T18:08:44+05:30 IST
తిరుపతి: తిరుపతి నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిలో ఉందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష పేర్కొన్నారు.
తిరుపతి: తిరుపతి నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిలో ఉందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష పేర్కొన్నారు. నగరవాసులు స్వీయ నియంత్రణ విధిగా పాటించాలన్నారు. మంగళవారం నాడు తిరుపతి నగరంలో 70 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు.
తిరుపతి నగరంలోని 50 డివిజన్లుకు గాను 40 డివిజన్లలో రెడ్ జోన్స్ ఉన్నాయన్నారు. నగరంలో 350 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 110 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జి చేశారన్నారు. కరోనా బారినపడిన వారిలో టీటీడీ ఉద్యోగులు సైతం ఉన్నారన్నారు. నగరవాసులు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని గిరీష పేర్కొన్నారు.