నలుగురికి మించి ఉండొద్దు..

ABN , First Publish Date - 2020-03-24T10:19:07+05:30 IST

అంటువ్యాధుల చట్టం 1897 నిబంధనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం దీనిలో మరికొన్ని కొత్త

నలుగురికి మించి ఉండొద్దు..

8 తర్వాత అన్ని షాపులు బంద్‌ చేయాలి

ప్రజలు సరుకుల కోసం 2 కి.మీ మించి వెళ్లకూడదు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అంటువ్యాధుల చట్టం 1897 నిబంధనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం దీనిలో మరికొన్ని కొత్త నిబంధనలు పొందుపరించింది. రాష్ట్రంలో పబ్లిక్‌ ప్రదేశాల్లో నలుగురికి మించి ఉంచకూడదని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి  రాత్రి 8 వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం రోడ్ల మీదకు రావాలని.. ద్విచక్రవాహనంపై ఇద్దరు, కార్లలో ఇద్దరుకు మించి ప్రయాణం చేయకూడదని, అది కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. రాత్రి 8 తర్వాత మందుల షాపుల తప్ప మరే ఇతర షాపులు తెరిచి ఉంచడానికి వీల్లేదని.. నిత్యావసరాల కోసం వచ్చే వారు వారి ఇంటి దగ్గర నుంచి కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వెళ్లాలని పేర్కొన్నారు.  

Read more