గ్యాస్ లీక్ ప్రమాదంపై అనేక అనుమానాలు: పవన్‌

ABN , First Publish Date - 2020-05-11T22:14:26+05:30 IST

ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ ప్రమాదంపై అనేక అనుమానాలున్నాయని జనసేనాని పవన్‌కల్యాణ్‌ సందేహం వ్యక్తం చేశారు. రసాయనశాస్త్ర నిపుణులు పలు అంశాలు తన దృష్టికి తెచ్చారని

గ్యాస్ లీక్ ప్రమాదంపై అనేక అనుమానాలు: పవన్‌

అమరావతి: ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ ప్రమాదంపై అనేక అనుమానాలున్నాయని జనసేనాని పవన్‌కల్యాణ్‌ సందేహం వ్యక్తం చేశారు. రసాయనశాస్త్ర నిపుణులు పలు అంశాలు తన దృష్టికి తెచ్చారని, ట్యాంక్ ఉష్ణోగ్రతలు లాక్‌డౌన్ సమయంలో ఎందుకు పర్యవేక్షించలేదని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ ఎందుకు మోగలేదని నిలదీశారు. యాజమాన్యం ప్రజలను ఎందుకు అప్రమత్తం చెయ్యలేదని, ట్యాంక్ పేలకుండా బ్రీథర్ వాల్వ్ తెరిచింది వాస్తవమేనా? అని ప్రశ్నించారు. మొత్తం 24 ఆంశాలలో లోతైన విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-11T22:14:26+05:30 IST