నేడు వైసీపీలోకి గంటా?

ABN , First Publish Date - 2020-10-03T16:04:27+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరతారనే..

నేడు వైసీపీలోకి గంటా?

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ముందు తన కొడుకుని వైసీపీలో చేర్చి బయటనుంచి పార్టీకి మద్దతు పలుతారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టుకోసం అధికారపార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం చేస్తోంది.


శనివారం సీఎం జగన్‌తో గంటా భేటీ కానున్నట్లు సమాచారం. అదే రోజు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుర్చుకోనున్నట్లు తెలియవచ్చింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందుగా వైసీపీ తీర్థం తీసుకునేందుకు యత్నించారు. అయితే స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అడ్డం పడడంతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగింది. కొద్ది రోజుల క్రితం గంటా నేరుగా జగన్‌తోనే మాట్లాడుకుని చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయనకు వీఎంఆర్డీయే ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-10-03T16:04:27+05:30 IST