గన్నవరం ఎయిర్ పోర్టులో తనిఖీలు.. భారీగా బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-20T04:24:27+05:30 IST

విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని గన్నవరం విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వందే భారత్ మిషన్‌లో..

గన్నవరం ఎయిర్ పోర్టులో తనిఖీలు.. భారీగా బంగారం స్వాధీనం

విజయవాడ: విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని గన్నవరం విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానంలో కువైట్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. హ్యాండ్‌బ్యాగుల్లో దాచిన సుమారు రూ.95 లక్షల విలువైన 1.865 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Updated Date - 2020-11-20T04:24:27+05:30 IST