‘లా నేస్తం’ నిధుల విడుదల
ABN , First Publish Date - 2020-07-08T08:29:46+05:30 IST
పలు వినతులు, వివిధ నిరసనల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్ లా నేస్తం’ కింద నిధులు విడుదల చేసింది.

పలు వినతులు, వివిధ నిరసనల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్ లా నేస్తం’ కింద నిధులు విడుదల చేసింది. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇచ్చే ‘స్టయిపెండ్’ కోసం వీటిని వినియోగిస్తారు. ఏప్రిల్ నెలలో 1958 మంది కోసం రూ.97,90,000, మే నెలలో 1946 మంది కోసం రూ.97,30,000, జూన్ నెలలో 1928 మంది కోసం రూ.96,40,000 ప్రభుత్వం విడుదల చేసింది.