కరోనా వల్ల కొవ్వూరులో పూర్తి స్థాయిలో లాక్ డౌన్: కలెక్టర్

ABN , First Publish Date - 2020-07-15T02:30:36+05:30 IST

కరోనా వల్ల కొవ్వూరులో పూర్తి స్థాయిలో లాక్ డౌన్: కలెక్టర్

కరోనా వల్ల కొవ్వూరులో పూర్తి స్థాయిలో లాక్ డౌన్: కలెక్టర్

పశ్చిమగోదావరి: కొవ్వూరులో బధవారం నుంచి 21వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే కిరాణ షాపులు తెరవడానికి అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు. మెడికల్ షాపులు పూర్తిగా తెరవడానికి అనుమతి ఉంటుందన్నారు. కొవ్వూరులో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్  అమలవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-15T02:30:36+05:30 IST