-
-
Home » Andhra Pradesh » Friendly murder by police negligence
-
పోలీసుల నిర్లక్ష్యంతోనే స్నేహలత హత్య
ABN , First Publish Date - 2020-12-27T07:23:24+05:30 IST
దళిత యువతి స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

సీఐను సస్పెండ్ చేసి, అట్రాసిటీ కేసు పెట్టాలి: మంద కృష్ణ
అనంతపురం, డిసెంబరు 26ఆంధ్రజ్యోతి): దళిత యువతి స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన అనంతపురం నగర వన్‌టౌన్ సీఐ ప్రతా్‌పరెడ్డిని సస్పెండ్ చేయటంతోపాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన స్థానిక దళిత సంఘాల నాయకులతో కలిసి స్నేహలత కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కోరారు.