16 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-05-13T12:44:24+05:30 IST

16 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీ

16 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీ

విశాఖ: రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ ఆదేశాల మేరకు నాల్గో విడత నిత్యావసర సరుకులు ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేయనున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో తెల్ల రేషన్‌కార్డుదారుల్లోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున, అంత్యోదయ అన్నాయోజన(ఏఏవై) కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు కలిగిన వారికి 10 కిలోల బియ్యం, కిలో శెనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

Read more