నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
ABN , First Publish Date - 2020-05-18T04:17:12+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ జరుగుతోంది. రెండు రోజుల్లో 50 లక్షల 69 వేల 293 కుటుంబాలకు...

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ జరుగుతోంది. రెండు రోజుల్లో 50 లక్షల 69 వేల 293 కుటుంబాలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేశారు. 80,845 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు 4,921 మెట్రిక్ టన్నుల శనగలు పంపిణీ చేశారు. పోర్టబులిటీ ద్వారా 12,61,917 కుటుంబాలు రేషన్ తీసుకున్నారని సివిల్ సప్లయిస్ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.