విషాదం.. నదిలో స్నానానికి దిగి...
ABN , First Publish Date - 2020-10-04T02:41:19+05:30 IST
రొయ్యూరులో విషాదం చోటు చేసుకుంది. ర్యాంప్ వద్ద నదిలో స్నానానికి దిగిన నలుగురు గల్లంతయ్యారు...

కృష్ణా: రొయ్యూరులో విషాదం చోటు చేసుకుంది. ర్యాంప్ వద్ద నదిలో స్నానానికి దిగిన నలుగురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన నలుగురు వ్యక్తులు కూడా కంకిపాడుకు చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.