ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ కస్టడీలో నలుగురు
ABN , First Publish Date - 2020-06-25T23:39:22+05:30 IST
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో నలుగురు నింధితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నవారిని విజయవాడకు తీసుకొచ్చి..

విజయవాడ: ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో నలుగురు నింధితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నవారిని విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తోన్నట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. విచారణలో కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఈ కేసుతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.