-
-
Home » Andhra Pradesh » Former Union Minister Kotla
-
మర్చిపోయిన ఫ్యాక్షన్‌ను వైసీపీ మళ్లీ రెచ్చగొడుతోంది: కోట్ల
ABN , First Publish Date - 2020-06-23T17:55:13+05:30 IST
మర్చిపోయిన ఫ్యాక్షన్‌ను వైసీపీ నేతలు మళ్లీ రెచ్చగొడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లాపై వైసీపీ నేతలకు అభిమానం

కర్నూలు: మర్చిపోయిన ఫ్యాక్షన్‌ను వైసీపీ నేతలు మళ్లీ రెచ్చగొడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లాపై వైసీపీ నేతలకు అభిమానం ఉంటే గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడికాలువ పనులు పూర్తి చేయించాలని కోరారు. ప్రశాంతంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ సోసైటీల్లో పెత్తనం కోసం గొడవలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మైనింగ్, ఇసుకలో భారీ అక్రమాలపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా?, కరోనాతో జనం అల్లాడిపోతుంటే వైసీపీ నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని కోట్ల మండిపడ్డారు.