రాష్ట్రంలో ప్రజలకు కోర్టులే దిక్కు

ABN , First Publish Date - 2020-07-04T08:39:26+05:30 IST

‘‘కోర్టుల జోక్యంతోనే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ దొరుకుతోంది. అలాంటి కోర్టులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం బాధ్యతారహితంగా ..

రాష్ట్రంలో ప్రజలకు కోర్టులే దిక్కు

కోర్టులను బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తే...

బజారుకు ఈడుస్తాం: మాజీ ఎంపీ సబ్బం హరి హెచ్చరిక


విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘‘కోర్టుల జోక్యంతోనే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ దొరుకుతోంది. అలాంటి కోర్టులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మరోసారి అలా మాట్లాడితే.. బజారుకు ఈడుస్తాం. రా ష్ట్రంలోని మేధావులు, ఉద్యమకారులు.. కోర్టులకు, న్యాయమూర్తులకు అండగా నిల వాలి’’ అని మాజీ ఎంపీ సబ్బం హరి పిలుపునిచ్చారు. విశాఖలో శుక్రవారం మీ డియాతో మాట్లాడారు. పరిపాలనలో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవలసి వస్తున్నదో తమ్మినేని ప్రశ్నించుకోవాలన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలున్నాయని, ఎక్కడా ఇలా కోర్టులు జోక్యం చేసుకోవడం లేదన్నారు. గతంలో ఎంతోమంది పరిపాలించారని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. ఈ విషయం స్పీకర్‌ కూడా తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారని, మరి ఇప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటే... దానికి కారణం ఎవరో చెప్పాలన్నారు. 151 సీట్లు వచ్చాయనే గర్వంతో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటుంటే.. బాధితులు గత్యంతరం లేక కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు.


‘‘మాతృ భాషలోనే ప్రాథమిక విద్య బోధన సాగాలని రాజ్యాంగంలో ఉంది. రాష్ట్రంలో ఇంగ్లీష్‌ తప్ప మరొకటి బోధించబోమంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాశారు. అందుకే కోర్టులు జోక్యం చేసుకున్నాయి. రాజధాని నిర్మిస్తామంటే రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు దా నిని మార్చేస్తామంటే.. ఆ రైతుల సంగతి ఏమిటని కోర్టులు ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుంది? కోర్టులను బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తే... ఉద్యమకారులు తమ్మినేనిపై కేసులు వేయడం ఖాయమని స్పష్టం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు.

Updated Date - 2020-07-04T08:39:26+05:30 IST