ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: పితాని

ABN , First Publish Date - 2020-06-18T18:16:18+05:30 IST

ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: పితాని

ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: పితాని

రాజమండ్రి: తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరలేదనే తనపై బురద చల్లుతున్నారని... తాను  విదేశాలకు, రహస్య స్థావరాలకు పారిపోయాననీ  ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి వద్దే  ఉంటానని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వం అరెస్ట్ చెయ్యాలని  చూసినా  భయపడేది లేదని ఆయన తెలిపారు. ఏపీలో  తమిళనాడు తరహాలో అధికారంలోకి  వచ్చిన పార్టీ కక్ష తీర్చుకునే విధానం సాగుతోందని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి  వ్యవహారంలో పోలీసులు  భయాందోళన రేకెత్తించారన్నారు. 9న శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరితే 10న  ఆయనకు మైనింగ్ లైసెన్స్ ఇచ్చేశారన్నారు. శిద్ధా రాఘవరావు వ్యవహారం చూస్తేనే జగన్ ప్రభుత్వంలో నీతి  అర్థమౌతోందని పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-18T18:16:18+05:30 IST