సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: నక్కా

ABN , First Publish Date - 2020-09-18T00:53:41+05:30 IST

జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. ‘వైఎస్. వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు

సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: నక్కా

అమరావతి: జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. ‘వైఎస్. వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయకూడదని జగన్ రెడ్డి బృందం హైకోర్టును ఆశ్రయించిన సంగతి గుర్తులేదా? దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టును ఆశ్రయిస్తే తప్పేంటి? ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటులో నింద ప్రచారం చేసిన నేరస్థులకు పదవిలో కొనసాగే అర్హత లేదు. విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యుడిగా ఉండటానికి అర్హత లేనప్పుడు విజయసాయిరెడ్డికి అర్హత ఎలా ఉంటుంది? ఉన్నత న్యాయస్థానంపై ధిక్కరించే విధంగా దుష్ప్రాచారం చేసిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. వివేకానందరెడ్డి కేసులో వచ్చిన తీర్పు దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో వస్తే హైకోర్టును నిందించడం కోర్టు ధిక్కరణ కాదా? న్యాయస్థానాలపై నిందలు వేస్తున్న విజయసాయిరెడ్డి, వైసీపీ నేతల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నిరసించాలి. ప్రజాస్వామ్య వాదులు, మేథావులు, ఉన్నత న్యాయస్థానాలపై నిందలు వేస్తున్న విజయసాయిరెడ్డి అరాచకాలను ప్రతిఒక్కరూ ఖంచించాలి’ అని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-18T00:53:41+05:30 IST