పుట్టినరోజు నాడే కొల్లు రవీంద్ర నిరశన

ABN , First Publish Date - 2020-06-21T09:55:38+05:30 IST

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్‌ 3 ఇళ్లు పేదలకు కేటాయించాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన పుట్టిన రోజు ..

పుట్టినరోజు నాడే కొల్లు రవీంద్ర నిరశన

జీ ప్లస్‌ 3 ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌


మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 20: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్‌ 3 ఇళ్లు పేదలకు కేటాయించాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన పుట్టిన రోజు నాడే మచిలీపట్నంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల వెయ్యి జీ ప్లస్‌ 3 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 3 లక్షల 9 వేల ఇళ్లు పూర్తయ్యాయన్నారు.


కృష్ణాజిల్లాకు 96వేల ఇళ్లు మంజూరు కాగా 31 వేలు పూర్తయ్యాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 4130 ఇళ్లు పూర్తయ్యాయని, లాటరీ వేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ వీరెవరికీ జీ ప్లస్‌ 3 ఇళ్లను స్వాధీనం చేయలేదన్నారు. నిర్మాణం పూర్తయిన వాటిని కేటాయించడానికి వచ్చిన సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-21T09:55:38+05:30 IST