మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి
ABN , First Publish Date - 2020-08-12T09:13:12+05:30 IST
కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎస్ఏ ఖలీల్‌బా షా(73) మృతి చెందారు.

- మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి
కడప(సిటీ), ఆగస్టు 11: కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎస్ఏ ఖలీల్‌బా షా(73) మృతి చెందారు. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఖలీల్ 1994లో కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.