-
-
Home » Andhra Pradesh » Former Minister Jawahar
-
సీఎంకి నాలుక మడతేయడం కూడా అలవాటైంది: జవహర్
ABN , First Publish Date - 2020-12-28T20:50:20+05:30 IST
సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఇంతలా అబద్ధాల ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు

అమరావతి: సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఇంతలా అబద్ధాల ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఆవ భూముల విషయంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆవ భూముల్లో ముఖ్యమంత్రి వాటా ఎంత? అని నిలదీశారు. మాట తప్పడం మడమ తిప్పడమే కాదు నాలుక మడతేయడం కూడా అలవాటైందని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జవహర్ విమర్శించారు.