అసమర్థ మంత్రులు: దేవినేని ధ్వజం

ABN , First Publish Date - 2020-05-18T09:30:12+05:30 IST

: ‘గత ఏడాది జూన్‌ పదో తేదీన మంత్రి అనిల్‌కుమార్‌ నిర్వహించిన సాగునీటి శాఖ సమీక్షలో పోలవరం పనులు 71.43ు జరిగాయని పేర్కొన్నారు.

అసమర్థ మంత్రులు: దేవినేని ధ్వజం

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘గత ఏడాది జూన్‌ పదో తేదీన మంత్రి అనిల్‌కుమార్‌ నిర్వహించిన సాగునీటి శాఖ సమీక్షలో పోలవరం పనులు 71.43ు జరిగాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో అదే పెట్టారు. మీడియా కూడా అదే రాసింది. ఈ ఏడాది మార్చిలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ పార్లమెంట్‌లో సమాధానం ఇస్తూ పోలవరం పనులు 69.54% పూర్తయ్యాయని చెప్పారు. ఈ వివరాలను రాష్ట్రమే కేంద్రానికి పంపింది. ముక్కూ చెవు లూ మీసాలూ తీసేసుకొంటానని ప్రకటనలు చేస్తున్న మంత్రి అనిల్‌ ఇప్పుడేం చే స్తారు?’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అయిన పనులను కూడా కాలేదని తగ్గించి చూపించి అబద్దాలు చెబుతున్న మంత్రి దానిపై సవాళ్లు విసరడం సిగ్గుచేటన్నారు. ‘24 గంటల్లో 32 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసినందుకు నవయుగ కంపెనీకి గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ వచ్చింది.


ఆరు నెలలు కష్టపడి ఆ కంపెనీని అక్కడ నుంచి వెళ్లగొట్టారు. రైతులకు మీ మీసాలు, బుల్లెట్లు కావాలా? నీళ్లు కావాలా? అతి తక్కువ వర్షం వచ్చినప్పుడు మేం రాయలసీమలో 150 చెరువులు నింపాం. కృష్ణా నదికి ఎనిమిదిసార్లు వరద వచ్చినా మీరు 54 చెరువులు మించి నింపలేకపోయారు. ఇరిగేషన్‌ మంత్రి జిల్లాలో సోమశిల కింద రెండో పంటకు నీరివ్వలేకపోయారు. ఇలాంటి అసమర్ధ మంత్రులు సవాళ్లు చేయడానికి... మీసాలు దువ్వడానికి సిగ్గుపడాలి’ అన్నారు. పోలవరంలో చంద్రబాబు కష్టాన్ని జగన్‌ చౌర్యం చేస్తున్నారని గొల్లపూడిలో ఉమా అన్నారు.  

Updated Date - 2020-05-18T09:30:12+05:30 IST