ప్రైవేటు వైద్యులపై కక్షసాధింపు: చినరాజప్ప
ABN , First Publish Date - 2020-08-22T09:25:40+05:30 IST
‘‘కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రైవేటు వైద్యులు తమ వంతు వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు.
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రైవేటు వైద్యులు తమ వంతు వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ మాత్రం వైద్యం కూడా ప్రజలకు అందకూడదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేస్తోంది’’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘‘డాక్టర్ రమేశ్ ఆచూకీ చెబితే రూ.లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించడం బాధాకరం. ఇది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపే. కరోనాపై మొదటి వరసలో నిలబడి పోరాడుతున్న వైద్యులను ప్రభుత్వం ఈ విధంగా వేధించడం వల్ల మనో ధైర్యం కోల్పోతున్నారు. ’’ అని రాజప్ప విమర్శించారు.