కేరళలా ఎందుకు చేయడం లేదు: బాబు

ABN , First Publish Date - 2020-04-21T20:02:51+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. కరోనాపై వాస్తవాలను

కేరళలా ఎందుకు చేయడం లేదు: బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. కరోనాపై వాస్తవాలను తొక్కిపెట్టడంపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడమే తప్పా? అని నిలదీశారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాపై పోరులో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. కేరళ మాదిరిగా ఎందుకు నిత్యావసర సరుకులను ఇవ్వలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. కేరళలో నిత్యావసర వస్తువుల కిట్‌లో 19 సరుకులు ఇస్తున్నారని చెప్పారు. వాలంటీర్లతో సరుకులు ఎందుకు డోర్ డెలివరీ చేయడం లేదన్నారు. మాస్క్‌లు ఇవ్వండని జూనియర్ డాక్టర్లు వేడుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. దానం చేయాలనుకుంటే ప్రభుత్వానికి చెప్పి చేయాలని జీవో జారీ చేయడం దుర్మార్గం అన్నారు.

Updated Date - 2020-04-21T20:02:51+05:30 IST