ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి: కారం శివాజీ

ABN , First Publish Date - 2020-05-09T18:43:53+05:30 IST

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి: కారం శివాజీ

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి: కారం శివాజీ

కాకినాడ: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కంపెనీ  యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇదే తరహాలో పనిచేస్తున్న ఫ్యాక్టరీ తీరుతెన్నులపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి పదివేల కోట్లు కేటాయించాలని కారం శివాజీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-05-09T18:43:53+05:30 IST