రాజ్యంగం రక్షించదనే రాష్ట్రపతికి వరప్రసాద్ లేఖ రాశాడు: గొల్లపల్లి

ABN , First Publish Date - 2020-08-11T18:27:42+05:30 IST

రాజ్యంగం రక్షించదనే రాష్ట్రపతికి వరప్రసాద్ లేఖ రాశాడు: గొల్లపల్లి

రాజ్యంగం రక్షించదనే రాష్ట్రపతికి  వరప్రసాద్ లేఖ రాశాడు: గొల్లపల్లి

అమరావతి: రాజ్యాంగం తనను రక్షించదని తెలిసే, వరప్రసాద్ తన ఆవేదన తెలియచేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశాడని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఎవరికి చెప్పుకున్నా ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదనే, ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడన్నారు. వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ చెప్పారని... అయితే 25 రోజులైనా అసలు నిందితులపై ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు. వరప్రసాద్ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. దళితజాతి మొత్తం తమకు జరుగుతున్న అవమానాలపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ, అంబేద్కర్ విగ్రహాల ఎదుట రేపు తమ ఆవేదన వ్యక్తం చేయాలని గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు.


Updated Date - 2020-08-11T18:27:42+05:30 IST